Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరకు పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్ వర్గాలు మాత్రం పుష్ప – 2 కలెక్షన్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే నార్త్‌లో అంచనాలకు మించి మొట్ట మొదటి రూ. 700 కోట్ల సినిమాగా నిలిచి  ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే రూ. 715 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ని దాటినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Trisha : కొడుకు మరణంతో.. తీరని దుఃఖంలో త్రిష

మొత్తంగా బాలీవుడ్‌లో పుష్పరాజ్ బాక్సాఫీస్ వేట రూ. 750 నుంచి రూ. 800 కోట్ల మధ్యలో ఆగేలా ఉందంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.  300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని క్రాస్ చేసింది. అటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 30 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లని అందుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే. ఇప్పటి వరకు 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే  బాహుబలి 2కి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది పుష్ప 2. మరో వంద కోట్లు రాబడితే బాహుబలి 2 రికార్డ్ బద్దలు కానుంది. బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లకు పైగా ఉంది. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూస్తే సెకండ్ ప్లేస్‌లో బాహుబలి ఉండగా రెండు వేల కోట్లతో దంగల్ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో  బాహుబలి 2 రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే జరిగితే రాజమౌళిని వెనక్కి నెట్టి సుకుమార్ టాప్ ప్లేస్‌కి వెళ్లిపోయినట్టే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *