Published on Dec 14, 2024 6:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రికార్డు వసూళ్లు అందుకోగా ఇప్పటికి ఫాస్టెస్ట్ నంబర్స్ తో ఇండియన్ సినిమా దగ్గర అదరగొట్టింది.

మరి వీక్ డేస్ లోకి వచ్చాక కూడా మంచి నంబర్స్ నమోదు చేస్తూ వచ్చిన పుష్ప 2 ఇపుడు రెండో వారాంతంలో దుమ్ము లేపేందుకు సిద్ధం అయ్యింది. ఇపుడు లేటెస్ట్ గా ఈ శనివారం బుకింగ్స్ ఇండియా వైడ్ గా సాలిడ్ గా పికప్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ శని, ఆదివారాల్లో మళ్ళీ పుష్ప రాజ్ ఇండియా వైడ్ భారీ నంబర్స్ సెట్ చేస్తాడని చెప్పాలి. ఆల్రెడీ 1100 కోట్లకి పైగా గ్రాస్ ని పుష్ప 2 క్రాస్ చేయగా ఈ వీకెండ్ కి ఈజీగా 1200 కోట్లు దాటేస్తాడని చెప్పొచ్చు. మరి ఈ రెండు రోజుల్లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *