సోషల్ మీడియాలో పుష్ప 2 టీజర్ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అతి తక్కువ టైమ్ లో 1.2 మిలియన్ లైక్స్ తో పాటు 85 మిలియన్ వ్యూస్ ఈ టీజర్ దక్కించుకుంది. యూట్యూబ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ అవుతోంది. పుష్ప 2 టీజర్ ను నిన్న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ పై క్రియేట్ అయిన హైప్ కూడా ఈ భారీ వ్యూస్ కు కారణం అనుకోవచ్చు. పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో నెలకొన్న క్రేజ్ కు ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ప్రూఫ్ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న పుష్ప 2 సినిమాను ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2లో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ వంటి కాస్టింగ్ ఉన్నారు. పుష్ప తో చూస్తే పుష్ప 2 మేకింగ్ మరింత హ్యూజ్ స్కేల్ లో ఉండబోతోంది.