Pushpa 2: బాక్స్ ఆఫీస్ రప్పా రప్పా  అంటే ఇదే.. నాలుగు రోజుల్లో 829!

  • పుష్ప ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు
  • బాక్స్ ఆఫీస్ రప్పా రప్పా అంటే ఇదే
  • నాలుగు రోజుల్లో 829 కోట్లు గ్రాస్ కలెక్షన్స్

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తర్వాత కొంత డివైడ్ టాక్ వచ్చింది కూడా. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు దూసుకుపోతోంది.

Ram Gopal Varma: హైకోర్టులో ఆర్జీవీకి మరోసారి ఊరట.. తొందరపాటు చర్యలొద్దు..!

ఈ సినిమా మొదటిరోజు 294 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా రెండోరోజు 449 కోట్లు సాధించింది. మూడో రోజు కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన సినిమా నాలుగో రోజుకి ఏకంగా 829 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెబుతున్నారు. ఇది ఒక ఆల్ టైం రికార్డ్ గా తెలుస్తోంది 800 కోట్ల కలెక్షన్లు అత్యంత వేగంగా సాధించిన సినిమాగా ఈ పుష్ప ది రూల్ సినిమా రికార్డులకు ఎక్కింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేసిన ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్, అజయ్, పావని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *