రెండు రోజుల్లో ‘పుష్ప-2’ విధ్వంసం.. మామూలుగా లేదుగా! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు వస్తున్నాయి.

ఈ సినిమా తొలిరోజే ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ చూడని వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ రెండు రోజుల్లో ఏకంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్న ఫాస్టెస్ట్ హిండియన్ మూవీగా ‘పుష్ప-2’ నిలిచిందని మేకర్స్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

The post రెండు రోజుల్లో ‘పుష్ప-2’ విధ్వంసం.. మామూలుగా లేదుగా! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *