Published on Dec 7, 2024 8:00 PM IST
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ఓ రేంజ్ లో అదరగొడుతున్న లేటెస్ట్ చిత్రమే “పుష్ప 2 ది రూల్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ చేసిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చి సెన్సేషనల్ వసూళ్లు ఇపుడు అందుకుంటుంది. అయితే ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఊహించని రేంజ్ బుకింగ్స్ ని సెట్ చేస్తూ సత్తా చాటుతుంది.
మెయిన్ గా బుక్ మై షో బుకింగ్స్ యాప్ లో అయితే ఒక్క గంటలో లక్ష టికెట్స్ అమ్ముడుపోవడం అనేది అరుదు. అయితే దానిని కొన్ని సినిమాలు ఒక్కసారి టచ్ చేసాయి. కానీ పుష్ప 2 మాత్రం రేర్ ఫీట్ ని ఏకంగా మూడు రోజులు వరుసగా నమోదు చేస్తూ ఒక యునిక్ రికార్డుని సెట్ చేసి దుమ్ము లేపింది. దీనితో ఇండియా లోనే ఏ సినిమాకి కూడా లేని ఒక క్రేజీ రికార్డు ఇపుడు పుష్ప రాజ్ ఖాతాలో పడింది అని చెప్పాలి.