Pushpa 2: ‘పుష్ప-2’ ఫస్ట్ రివ్యూ.. నెక్స్ట్ లెవెల్ మూవీ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు పుష్పరాజ్ కథ యూరప్ చేరిందట.

‘పుష్ప-2’ కథ పలు దేశాల్లో సాగుతుందని.. అందుకోసం ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పనులు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను యూరప్‌కి చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ జరుపుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ సీన్స్ చాలా స్టన్నింగ్‌గా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.

అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The post యూరప్ చేరిన పుష్పరాజ్ కథ.. అక్కడ ఏం చేస్తున్నాడంటే..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *