మొల్లేటి ‘పుష్ప’రాజు విధ్వంసం..1000 కోట్లతో చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘పుష్ప-2’ అనే చెప్పాలి. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటవిశ్వరూపంతో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాకు తొలిరోజు నుంచే సాలిడ్ వసూళ్లు వస్తుండటంతో అందరి చూపులు ఈ సినిమాపై పడ్డాయి.

కాగా, ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా వెయ్యి కోట్ల మార్క్ దాటేసిన ‘పుష్ప-2’ రోజులు గడుస్తున్నా తన వసూళ్లను మాత్రం తగ్గడం లేదు. తాజాగా 11 రోజులు పూర్తయ్యే సరికి ‘పుష్ప-2’ మూవీ వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.1409 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. 2024లోనే ఈ మూవీ ఇండియన్ సినిమాలోనే హయ్యె్స్ట్ గ్రాసర్‌గా నిలిచిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

The post బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప-2’ ర్యాంపేజ్.. 11 రోజుల్లో వసూళ్లు ఎంతంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *