Published on Nov 5, 2024 2:01 AM IST
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే, అమెరికాలో పుష్ప-2 మూవీపై నెలకొన్న అంచనాలను అక్కడి ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది. తాజాగా అమెరికాలోని నేషనల్ సినిమా చైన్‌లో పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్ టబ్, సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
కంగువా చిత్ర ప్రీమియర్స్‌తో ఈ వస్తువులు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పుష్ప-2 మ్యాడ్‌నెస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోందని పుష్పరాజ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో డిసెంబర్ 4న ‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి.