Pushpa – 2 : నేపాల్ లో కూడా జెండా ఎగరేసిన పుష్పరాజ్

మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు లేదని, అల్లు అర్జున్‌ని తక్కువ అంచనా వేశానని, కానీ కట్ చేస్తే.. పార్ట్ 1 ఫిగర్స్ అదిరిపోయాయని ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు సుకుమార్.

ఇక ఆ తర్వాత పెరిగిన అంచనాలకు మించి పుష్ప 2 చేసి రూ. 1700 కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నేపాల్‌లో అయితే పుష్పరాజ్ దుమ్ముదులిపేస్తున్నాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా  ఇంటర్నేషనల్ అంటూ నేపాల్‌లోను ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు పుష్పరాజ్. 20 రోజుల్లోనే నేపాల్‌లో రూ. 24.75 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది పుష్ప – 2. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్‌ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్‌-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా వెల్లడించింది. విదేశాల్లో పుష్పగాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా నేపాల్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప – 2 ఈ రేంజ్ హిట్ అవుతుందని సుకుమార్ ముందుగా అస్సలు ఊహించలేదనే చెప్పాలి. మరి లాంగ్ రన్‌లో పుష్ప2 ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *