SSMB 29 : రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు .

ఫైనల్‌గా SSMB 29 బిగ్ అప్డేట్ వచ్చేసింది. రేపు అనగా జనవరి 2న ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని SS రాజమౌళి ఆఫీస్‌లో ఈ పూజా కార్యక్రమం జరగనుంది. అలాగే జనవరి చివరి వారం నుంచి షూటింగ్ పనులు స్టార్ట్ చేయనున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇటీవల విదేశీ పర్యటన ముగించికుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు రాజమౌళి తో పాటు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ఈ వేడుకకు రానున్నట్టు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మాత్రం ఆఫ్రికాలో స్టార్ట్ చేస్తున్నటు టాక్ . కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, అక్కడ కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కెన్యాతో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ చేసే అవకాశం ఉందట. అయితే  ఈ  విషయంలో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *