Rajamouli Mahesh movie shooting video leaked
Rajamouli Mahesh movie shooting video leaked

మహేష్ బాబు – రాజమౌళి మూవీపై భారీ అంచనాలు! సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా గ్లోబల్ లెవెల్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మహేష్ లుక్ లీక్ కావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

షూటింగ్ వీడియో లీక్ – ఫ్యాన్స్ లో సంచలం! ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్ అవ్వడం వైరల్ గా మారింది. ఎవరో షూటింగ్ స్పాట్‌లో ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో రాజమౌళి టీమ్ తగిన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మహేష్ లుక్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్! లీకైన వీడియోలో మహేష్ కొత్త లుక్ లో కనిపించగా, ఇది ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అంతేకాకుండా ఇందులో రామాయణం టచ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్ గా ప్రియాంక చోప్రా – షూటింగ్ త్వరలో! తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో జాయిన్ కానుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ త్వరలోనే మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ ఇవ్వనుంది!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *