హీరో రాజశేఖర్ క్యారెక్టర్స్ వైపు మళ్లుతున్నారు. ఇటీవల నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా స్పెషల్ రోల్ చేశారు రాజశేఖర్. తాజాగా ఆయన ఇలాంటి మరో ఆఫర్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి రూపొందిస్తున్న సినిమాలో రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ తండ్రిగా ఆయన కనిపించబోతున్నారు. శర్వానంద్ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ప్రస్తుతం మనమే అనే సినిమాలో నటిస్తున్నారు శర్వానంద్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.