డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “హరికథ” అనే కొత్త వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న “హరికథ” సిరీస్ లో దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి “హరికథ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ క్రమంలో “హరికథ” సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేరు ప్రస్తావించకుండా పుష్ప 2 సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Manchu Family: మంచు ఫ్యామిలీ ‘డ్రామా’.. మనోజ్ ఫిర్యాదులో ట్విస్ట్!
‘త్రేతా యుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తునే వున్నారు కళ్ళముందు. నిన్న గాక మొన్న చూసాం. వాడెవడో చందనం దుంగలు దొంగ, వాడు హీరో. సరే హీరోలలో మీనింగ్స్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, 48 సంవత్సరాలుగా ఐ యామ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నాది 48 ఏళ్ల నట జీవితం, ఇంత సుదీర్ఘ కాలం నటుడిగా కొనసాగడం సాధారణ విషయం కాదని ఆయన అన్నారు. ఎంతోమంది హీరోలతో కలిసి నటిస్తూ వస్తున్నాను. ఈ తరం హీరోలతో కూడా నటిస్తున్నానని ఆయన అన్నారు. అయితే ఆయన పేరు ప్రస్తావించక పోయినా ఎర్రచందనం అనగానే పుష్ప, పుష్ప2 సినిమాలే గుర్తు వస్తాయి. ఆయన హీరో క్యారెక్టర్ గురించి అన్నా సరే ఇప్పుడు అల్లు ఫాన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.