- కొనసాగుతున్న రీ- రిలీజ్ పర్వం
- రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నరసింహా
- ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీ- రిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్‌లో చూసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నరసింహా’ రీ రిలీజ్ కానుందని సమాచారం. కాగా.. రజినీకాంత్ 1975 తమిళ నాటకం అపూర్వ రాగంగల్‌తో సినీ రంగ ప్రవేశం చేసాడు. అయితే.. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ సందర్భంగా ఆగస్టు 19న ‘నరసింహా’ మరోసారి థియేటర్స్‌లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
READ MORE: PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఇదిలా ఉండగా.. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది. నరసింహా- నీలాంబరి జంట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. నరసింహా ప్రేమకోసం నీలాంబరి తన జీవితాన్నే పోగొట్టుకుంటుంది. ప్రేమను పగగా మార్చుకొని అతడి అంటూ చూడాలనుకొని.. చివరికి ఆమె అంతం అయిపోతుంది. ఇప్పటికీ నీలాంబరి ప్రేమ గురించి, ఆమె పొగరు గురించి ఎక్కడో ఒకచోట మాట్లాడుకుంటూనే ఉంటారు. 1999లో విడుదలైన ఈ సినిమా మళ్లీ అభిమానుల ముందుకు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..