రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టయాన్ సినిమా రిలీజ్ పై అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వేట్టయాన్ సినిమాను దర్శకుడు టీజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ కలిసి నటిస్తున్నారు. వేట్టయాన్ లో ముగ్గురు హీరోయిన్స్ ఉండటం విశేషం. రితిక సింగ్, దుశార విజయన్, మంజు వారియర్ కీ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఫేక్ ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజీ జ్ఞానవేల్ గత సినిమా జై భీమ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్ పొందింది. ఈ నేపథ్యంలో వేట్టయాన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అక్టోబర్ లో వేట్టయాన్ రిలీజ్ అంటే ఎన్టీఆర్ దేవరతో పోటీ అనుకోవచ్చు. దేవర అక్టోబర్ 10న దసరాకు రిలీజ్ కాబోతోంది.