
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం సినిమాల నుంచి కొంత దూరంగా ఉంది. యంగ్ హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉండటంతో సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. రకుల్ తెలుగులో 18 సినిమాలు చేసినా, వరుస ఫ్లాప్‌లు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపాయి.
రకుల్ ప్రీత్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 18 ఏళ్లకే మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన రకుల్, 2009లో “గిల్లి” అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో 2011లో “కెరటం” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్” ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇటీవల బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న రకుల్, సినిమాల్లో కొనసాగుతూనే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఆమె తెలుగులో చివరి ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి.
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ, అదే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి, రకుల్ తిరిగి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుందా? లేదా బాలీవుడ్‌కే పరిమితం అవుతుందా? వేచి చూడాలి.