టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం “ఓజీ” కూడా ఒకటి. ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన సర్ప్రైజ్‌లు ఉండనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అందులో ముఖ్యంగా పవన్ వారసుడు అకిరా నందన్ సినిమాలో కనిపించనున్నాడనే పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అకిరా పాత్ర గురించి స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న “అన్ స్టాప్పబుల్” టాక్ షో సీజన్ 4లో గెస్ట్‌గా హాజరవుతూ, అకిరా నందన్ పాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ ఎపిసోడ్ జనవరి 8 సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్‌కి రానుంది. చరణ్ ఈ విషయంలో పాజిటివ్ సమాధానం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆ సమాధానం ఏమిటో తెలియాలంటే ఆ షోను తప్పకుండా చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.