Published on Jan 5, 2025 1:00 PM IST
‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఒక భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు.
ఇంతకీ, చరణ్ ఏం మెసేజ్ చేశారంటే..“ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీ అన్నయ్య కొడుకుగా, ఒక నటుడిగా, ఒక భారతీయుడిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఎల్లప్పుడూ నాకు అండగా ఉండి నాకు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ నాకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చరణ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
కాగా ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్‌రాజ్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానుంది.