Published on Dec 18, 2024 7:01 AM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. అయితే ఈ చిత్రం విషయంలో మాత్రం మెగా అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నారని చెప్పాలి. సమయం దగ్గరకు వస్తున్నా ఆఫ్ లైన్ లో సరైన ప్రమోషన్స్ లేవని అంటున్నారు.
ఇంకా ఓవర్సీస్ మార్కెట్ టికెట్ బుకింగ్స్ కి సంబంధించి కూడా వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు మెయిన్ ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయడం లేదని చాలా వరస్ట్ ప్లానింగ్ తో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని తీసుకొస్తున్నారు అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇలా గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం అభిమానులు ఇపుడు ఒకింత నిరాశ గానే ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ జనవరి 10న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.