టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ హీరో గానే కాకుండా ఓటిటి షోలో హోస్ట్ గా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో చేస్తున్న అన్ స్టాప్పబుల్ షోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ షోలో ఇప్పుడు వరకు మూడు సీజన్లు కంప్లీట్ అయ్యి ఇపుడు నాలుగో సీజన్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా ఈ షోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాగా ఈ అవైటెడ్ ఎపిసోడ్ తాలూకా ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ ప్రోమో మాత్రం ప్యూర్ గా ఉందని చెప్పాలి.
బాలయ్యతో చరణ్ కి ఎప్పుడు నుంచో మంచి బాండింగ్ ఉందని అందరికీ తెలిసిందే. ఇపుడు ఈ ప్రోమోలో కూడా వారి నడుమ ఎంటర్టైన్మెంట్ గాని ఎమోషనల్ కన్వర్జేషన్ లు ఎంతో అలరించాయి. అలాగే ఇదే ఎపిసోడ్ లో శర్వానంద్ ఎంట్రీ, తనతో మాటలు రామ్ చరణ్ పై కొన్ని తెలియని అంశాలు వంటివి ముగ్గురు నడుమ మంచి ఫన్ ని జెనరేట్ చేసాయి.
ఇక దీనితో పాటుగా చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం కానీ తన బిడ్డ పుట్టినపుడు ఎమోషనల్ భావాలు ఇంకా తన కూతురు క్లిన్ కారా ని ఎప్పుడు చూపిస్తారు అంటే తాను నన్ను ఎపుడు నాన్న అని పిలుస్తుందో ఆరోజున అందరికీ చూపిస్తా అని చెప్పడం వంటివి ఎంతో ఎమోషనల్ గా అనిపించాయి. ఇక ఫైనల్ గా డార్లింగ్ హీరో ప్రభాస్ తో ఫోన్ కాల్ లో చరణ్ కోసం ప్రభాస్ చెప్తున్న కొన్ని సీక్రెట్స్ వంటివి ఓ రేంజ్ లో ఎంటర్టైనింగ్ గా కనిపించాయి. మరి ఈ క్రేజీ ఎపిసోడ్ ని ఆహా వారు ఈ జనవరి 8న సాయంత్రం 7 గంటలకి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. ఆహా లో డోంట్ మిస్.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The post బాలయ్యతో రామ్ చరణ్ ప్రోమో.. ఫన్, ఎమోషనల్ మూమెంట్స్ తో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.