Ram Charan RC 16 Shooting Details
Ram Charan RC 16 Shooting Details

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ‘పెద్ది’, ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి అధికారిక టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించగా, తాజా షెడ్యూల్ ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కలిసి నటించనున్నట్లు టాక్. పార్లమెంటులో చిత్రీకరణకు అనుమతి లభించిందని సమాచారం. చిత్ర బృందం జామా మసీద్ వంటి ప్రసిద్ధ ప్రాంతాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం ‘RC 16’ టీమ్ ఢిల్లీలో ఎక్కువ రోజులు గడపాల్సి రావొచ్చని అంటున్నారు.

ఇటీవలే అమెరికాలో క్యాన్సర్ చికిత్స పూర్తి చేసుకుని తిరిగి కోలుకున్న శివరాజ్ కుమార్, ఈ సినిమాలో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రామ్ చరణ్‌తో కలిసి ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. అలాగే జగపతి బాబు, ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. గ్రాండ్ విజువల్స్, పాన్-ఇండియా స్కేల్‌లో రూపొందుతున్న ఈ సినిమా, రామ్ చరణ్ ఫ్యాన్స్‌‌కు నిజమైన ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *