- సోషల్ మీడియాలో వైరల్
- సెల్ఫీ వీడియోతో రామ్ చరణ్
- థ్యాంక్యూ అమెరికా అంటూ..
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత దిల్ రాజు ఇంకా మిగితా గేమ్ ఛేంజర్ టీమ్ సభ్యులంతా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చివరగా మాట్లాడిన తర్వాత.. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో “థ్యాంక్యూ అమెరికా” అంటూ అక్కడి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ సెల్ఫీ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ, థ్యాంక్యూ సో మచ్ అమెరికా.. మోస్ట్ మెమరబుల్ నైట్.. ఈ ఈవెంట్‌ని విజయవంతంగా నిర్వహించిన రాజేష్ కళ్లేపల్లి అండ్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలని రాసుకొచ్చారు. దాంతో ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రజలను చూడగానే సినీ ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో కూడా వెనుకన ఎక్కువ సంఖ్యలో అభిమానులను మనం చూడవచ్చు. ఈ వేడుకతో “గేమ్ ఛేంజర్” సినిమా అమెరికాలో మరింత హైప్ అందుకుంది. రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ టీమ్ తీరుతో ప్రేక్షకులు, అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ వేడుక రాబోయే రోజుల్లో సినిమా విజయానికి ఊతమిచ్చేలా ఉంది.