
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ – రామ్ చరణ్ కాంబో మరోసారి కలవబోతోంది. మరోసారి పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ లోనే ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఇప్పటికే పుష్ప 2 రికార్డులు తిరగరాసిన సుకుమార్, ఈ మూవీతో మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నారన్న హైప్ ఉంది.
పుష్ప 2 ఇటీవలే 1871 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఈ ఘనత మొత్తం సుకుమార్ క్రెడిట్ అని చెప్పడం విశేషం. ఈ ఎనర్జీతోనే రామ్ చరణ్ మూవీ పై మరింత ఎక్స్‌పెక్టేషన్ పెరిగింది. RRRతో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న చెర్రీ, ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మరింత దూసుకుపోయే అవకాశం ఉంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా ఫిక్స్ అయ్యిందని సమాచారం. సుకుమార్ తన కెరీర్ లో మొదటిసారి ఒకే హీరోయిన్ ను బ్యాక్-టు-బ్యాక్ రిపీట్ చేస్తున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఇది రష్మిక క్రేజ్ కు నిదర్శనం.
ఇంకా, ఆర్సీ 16 కు కూడా సుకుమార్ గైడెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చెర్రీ కెరీర్‌లో మరో వైవిధ్యమైన కథ గా నిలవబోతుందని టాక్. సుకుమార్ తన శిష్యుడి సినిమాకు మెరుగులు దిద్దుతూ, మరోవైపు తన సినిమాకు పునాదులు వేస్తున్నారు అని ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.