RAPO22: గ్రాండ్‌గా రామ్ పోతినేని కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 12, 2024 11:00 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లాస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన తన కొత్త సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అనౌన్స్ చేశాడు.

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి ఎంటర్‌టైనింగ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మహేశ్ బాబు డైరెక్షన్‌లో రామ్ పోతినేని హీరోగా ఓ సరికొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. రామ్ పోతినేని లాస్ట్ చిత్రాల్లో ఇదే బెస్ట్‌గా ఉండబోతుందని వారు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రామ్‌ను మరింత ఎనర్జిటిక్‌గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలిపారు.

ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *