
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎప్పటికప్పుడు కొత్త కథలు, డిఫరెంట్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ తన 22వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, ఇప్పటికే విడుదలైన రామ్ ఫస్ట్ లుక్ భారీగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో రామ్ “సాగర్” అనే పాత్రలో కనిపించనున్నాడు. విడుదలైన ఫస్ట్ లుక్‌ను చూస్తే వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్, పాతకాలం స్టైల్ సైకిల్ – అన్నీ కలిపి రామ్ లుక్‌ను చాలా యూనిక్ గా తీర్చిదిద్దారు. “మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్” అంటూ దర్శకుడు మహేష్ బాబు పి రామ్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
ఈ సినిమాతో రామ్ తన అభిమానులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఇవ్వనున్నాడట. అదేంటంటే, ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్ ను రామ్ స్వయంగా రాశాడట. catchy lyrics తో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాపై ఇప్పటికే బిగ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. రామ్ కొత్త లుక్, ఫ్రెష్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ – అన్నీ కలిపి ఈ సినిమాను టాప్ లెవెల్లో నిలబెట్టేలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!