
90వ దశకం లో టాలీవుడ్‌ను ఏలిన అందాల తార రంభ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు వంటి సూపర్ హిట్స్ అందించింది. హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోనూ తన స్టెప్పులతో అలరించింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో రంభ చేసిన ఐటెం సాంగ్స్ అప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయి.
గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు రీ ఎంట్రీ కి సిద్ధమైంది. ఆమె మాట్లాడుతూ –
“నా మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమానే. ఇప్పుడు కొత్త పాత్రలను ఎంచుకుని, మరింత ఆకట్టుకునే విధంగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాను.”
రంభ ఎటువంటి పాత్రలతో తిరిగి వస్తుందో? ఆమె హీరోయిన్ పాత్రలే చేస్తుందా లేదా కేరక్టర్ రోల్స్ లో మెరిసిపోతుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది. రంభ రీ ఎంట్రీ పై అందరి దృష్టి ఉంది!