Rana Naidu Season 2 Release Date Confirmed

ఓటీటీ (OTT) దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో రెండేళ్ల క్రితం విడుదలైన ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ (Web Series) ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ (Tollywood) కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు (Star Heroes), అందులోనూ బాబాయ్ అబ్బాయ్‌లు వెంకటేష్ (Venkatesh) మరియు రానా (Rana) కలిసి నటించిన ఈ సిరీస్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ, వాటన్నిటినీ తలకిందులు చేస్తూ సిరీస్‌లో బూతులు, అడల్ట్ సీన్స్ (Adult Scenes), బోల్డ్ కంటెంట్ (Bold Content) నింపారు. దీంతో వెంకీ ఫ్యాన్స్, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ (Family Audience) షాక్ అయ్యారు. రానా, అందులోనూ వెంకీ మామ ఇలాంటి సిరీస్ చేయడమేంటి? అని విమర్శలు కురిపించారు. అయితే, ఎన్ని విమర్శలు వచ్చినా ‘రానా నాయుడు’ సిరీస్‌ను మాత్రం ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ (Popular) పొందిన సిరీస్‌గా ఇది నిలిచింది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller) సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని మొదటి పార్ట్ (Part) లోనే క్లారిటీ (Clarity) ఇచ్చారు. అనుకున్నట్లే, ఇప్పుడు ‘రానా నాయుడు సీజన్ 2’ (Rana Naidu Season 2) రాబోతోంది. తొలి సీజన్ పై విమర్శల నేపథ్యంలో, ఈ సీజన్ (Season) లో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేష్ చెప్పుకొచ్చారు. కాబట్టి, ఈ కొత్త సీజన్ పై కొంచెం ఆసక్తి పెరిగిపోయింది.

‘రానా నాయుడు సీజన్ 2’ టీజర్ (Teaser) కూడా ఇప్పటికే రిలీజ్ (Release) చేశారు. తాజాగా ఈ క్రైమ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను (Streaming Date) అధికారికంగా (Official) ప్రకటించారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) స్వయంగా ‘రానా నాయుడు సీజన్ 2’ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో (Platform) జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ (Streaming) అవ్వబోతున్నట్టు అనౌన్స్ (Announce) చేశాడు. హిందీ (Hindi) తో పాటు తెలుగు (Telugu), తమిళ్ (Tamil), కన్నడ (Kannada), మలయాళ (Malayalam) భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది.

‘రానా నాయుడు సీజన్ 2’ లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్ (Arjun Rampal), సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి ఖర్బందా (Kriti Kharbanda), సుశాంత్ సింగ్ (Sushanth Singh), అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), డినో మోరియా (Dino Morea) లాంటి స్టార్ యాక్టర్లు (Actors) నటించారు. దీంతో ఈ సెకండ్ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ (Trailer) కూడా విడుదల కానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *