
నెట్‌ఫ్లిక్స్‌లో రెండు సంవత్సరాల క్రితం విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంతటి సంచలనాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానా దగ్గుబాటి, వెంకటేష్ కలసి స్క్రీన్‌పై కనిపించడం, భారీ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కొంత మంది ఈ సిరీస్‌లో ఉన్న అడల్ట్ కంటెంట్‌పై విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడీ క్రేజీ సిరీస్‌కు కొనసాగింపుగా రానా నాయుడు సీజన్ 2 రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ చూస్తే, రెండవ సీజన్‌లో యాక్షన్, థ్రిల్ మరింత పెరిగేలా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తొలి సీజన్‌కు వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి అభ్యంతరకర కంటెంట్ తగ్గించినట్టు ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతోంది.
వెంకటేశ్ – రానా డైనమిక్ మళ్లీ రిపీట్!
వెంకటేశ్ – రానా మధ్య ఉండే సైకలాజికల్ గేమ్ ప్లే, ఎమోషనల్ కన్‌ఫ్లిక్ట్ ఈ సీజన్‌లోనూ హైలైట్ కానుంది. రానా పాత్ర మరింత మోసపూరితంగా మారుతుండగా, వెంకటేశ్ పాత్రలో కొత్త కోణాలు కనిపించనున్నాయి.
స్ట్రీమింగ్ డేట్: జూన్ 13, 2025
రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
తారాగణం:
రానా దగ్గుబాటి, వెంకటేశ్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, కృతి ఖర్బందా, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకత్వం:
కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా