ఆన్ లొకేషన్ సెట్స్ నుంచి రామాయణం సినిమా వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. శ్రీ రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో కన్నడ హీరో యష్ ఒకరు.

ఆయన ఈ చిత్రంలో రావణాసురిడిగా కనిపిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. శ్రీరాముడు, సీత పాత్రల్లో రణ్ బీర్, సాయి పల్లవి నడుచుకుంటూ వస్తున్న ఫొటోస్ ఈ లీక్డ్ పిక్స్ లో ఉన్నాయి. రాముడు, సీతగా ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటులు కనిపించారు. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కూడా ఈ ఇతిహాసిక పాత్రలకు సరిగ్గా సరిపోయినట్లు ఈ పిక్స్ ద్వారా తెలుస్తోంది.