
కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఆమె వద్ద 14.8 కిలోల బంగారం (రూ.12 కోట్లు విలువ) పట్టుబడింది.
ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఆమె కస్టడీ కోరగా, కోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. విచారణలో రన్యా రావు ఈ ఏడాది 27 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని అధికారులు వెల్లడించారు. స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఆమె పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయని తెలిపారు.
నటి తరపు న్యాయవాది వాదన ప్రకారం, డీఆర్‌ఐ ఇప్పటికే విచారించిందని, మరింత కస్టడీ అవసరం లేదని కోర్టుకు తెలియజేశారు. అయితే, దర్యాప్తు బృందం ఆమె ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని కీలక డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసు దృష్టిని ఆకర్షిస్తుండటంతో శుక్రవారం రానున్న కోర్టు తీర్పుపై అందరి దృష్టి ఉంది.