
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసు లో కన్నడ నటి రన్యా రావు కు చుక్కెదురైంది. Directorate of Revenue Intelligence (DRI) ఆమెను మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో 14.2 కేజీల బంగారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. విచారణలో రన్యా రావు 27 సార్లు దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
స్మగ్లింగ్ మోడ్: ప్రతిసారి ఒకే డ్రెస్ లో వెళ్లి, కాళ్లలో, బెల్ట్ లో గోల్డ్ దాచి స్మగ్లింగ్ చేసింది. గత రెండు నెలల్లో 10 సార్లు దుబాయ్ టూర్ వేసిందని, ఒక్కో ట్రిప్పు ద్వారా ₹10 లక్షల నుండి ₹50 లక్షల వరకు సంపాదించిందని అధికారులు వెల్లడించారు.
రన్యా రావు వీఐపీ ఎగ్జిట్ ద్వారా తక్కువ చెకింగ్‌తో బయటకు వచ్చేది. ఓ కానిస్టేబుల్ ఆమెకు సహాయపడినట్లు సమాచారం. ఈ కానిస్టేబుల్ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. అలాగే, రన్యా రావు యూరప్, అమెరికా వంటి దేశాలకు కూడా వెళ్లినట్లు విచారణలో బయటపడింది.
ప్రస్తుతం ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు కొనసాగుతుండగా, DRI కస్టడీలో ఆమె నుంచి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు మరిన్ని సంచలనాలను రాబట్టేలా కనిపిస్తోంది.