Rapo 22 : జెట్ స్పీడ్ లో రామ్ పోతినేని 22 షూటింగ్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఆ మధ్య ‘మీకు సుపరిచితుడు మీలో ఒకడు మీ సాగర్’ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాడు దర్శకుడు మహేశ్. ఈ సినిమా షూట్ ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఓ కాలేజీలో జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రామ్ అలాగే భాగ్యశ్రీ బోర్స్ లపై కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. సంక్రాంతికి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఓ వైపు రామ్ ఈ సినిమా షూట్ లో పాల్గొంటూనే మరోవైపు తన అభిమానులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఉన్నత ప్రామానిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *