
తెలుగు బుల్లితెరలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాంకర్ రష్మీ గౌతమ్, తన మాటల చాతుర్యంతో, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హోలీ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, కరెంట్, గుంటూరు టాకీస్, నువ్వే నువ్వే వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు బుల్లితెర నుంచే వచ్చింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
రష్మీ – సుధీర్ మధ్య రిలేషన్ ఉందంటూ ఎప్పటి నుంచో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులమని చెప్పినా, అభిమానులు మాత్రం వీరి కెమిస్ట్రీ చూసి మరోలా అనుకుంటున్నారు. వీరి పాపులారిటీ, జబర్దస్త్ ద్వారా మరింత పెరిగింది. దీంతో ఇద్దరూ బుల్లితెర నుంచి వెండితెర వైపు ప్రయాణం చేశారు.
ప్రస్తుతం రష్మీ బుల్లితెర, వెండితెర రెండు చోట్ల బిజీగా ఉంది. అదే సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇటీవల ఆమె పింక్ కలర్ శారీలో చేసిన ఫోటోషూట్ తెగ వైరల్ అయింది. సింపుల్ లుక్‌లోనూ స్టన్నింగ్‌గా కనిపించిన రష్మీని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రెడ్ శారీ లుక్‌లోనూ ఆమె మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
రష్మీ గౌతమ్ తన టాలెంట్‌తో, అందంతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర, వెండితెర రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది.