
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నది రష్మిక మందన్నా. కన్నడ చిత్రసీమలో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ, తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా వరుస హిట్స్ అందుకుంటూ తన స్థాయిని మరింత పెంచుకుంటోంది.
తాజాగా రష్మిక ఒక అరుదైన రికార్డు సాధించింది. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు వరుసగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరాయి. ఇది ఇప్పటివరకు ఏ హీరోయిన్ సాధించని ఘనత. యానిమల్ సినిమా రూ.556.36 కోట్లు, పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.830 కోట్లు, ఛావా సినిమా రూ.516 కోట్లు వసూలు చేయడంతో, రష్మిక పేరు మరోసారి తెరపై మారుమోగుతోంది.
ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ అయితే, రష్మిక క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంది. ఆమె సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండటంతో, అభిమానులు ఆమెను లక్కీ చామ్ అంటున్నారు.
రష్మిక కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు, తన నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. తెలుగులో పుష్ప 2, తమిళంలో రెయిన్ బో, హిందీలో సికందర్ వంటి మల్టీ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ చేస్తూ, ఇండియన్ సినిమా లో అగ్రస్థానానికి ఎదుగుతోంది. ఆమె చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుండటంతో, రష్మిక ఖాతాలో మరిన్ని రికార్డులు నమోదు అవ్వడం ఖాయం.