
రష్మిక మందన్నా వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. అయితే, ఈ విజయాల వెనుక తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. తాజాగా, కర్ణాటక ఎమ్మెల్యే రవికుమార్ గనిగ రష్మికపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆమెకు గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు.
వివాదానికి కారణం, ఇటీవల రష్మిక తాను హైదరాబాదీ అని చెప్పుకోవడం. దీంతో కన్నడ అభిమానులు, రాజకీయ నాయకులు ఆమెపై విమర్శలు గుప్పించారు. రష్మిక కన్నడ పరిశ్రమలోకి “కిరాక్ పార్టీ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆమె తెలుగు, హిందీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
రష్మికపై రాజకీయ విమర్శలు పెరిగిపోతుండటంతో, కోడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రష్మిక భద్రత పెంచాలని, ఆమెను అనవసరంగా విమర్శించొద్దని కోరారు.
“రష్మిక మందన్నా తన కృషితో, అంకితభావంతో ఇంతటి స్థాయికి ఎదిగింది. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలి” అని నాచప్ప అన్నారు.
ఇక రష్మిక అభిమానులు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ “అవసరమైన వారికే రష్మిక సమాధానం చెబుతుంది. విమర్శలకు ఆమె స్పందించాల్సిన అవసరం లేదు” అంటూ సోషల్ మీడియాలో మద్దతు తెలియజేస్తున్నారు.