నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో యావత్ దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఈ సినిమాలో చేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా అందరు ‘పుష్ప-2’ మేనియాలో ఉండగానే, తన నెక్స్ట్ మూవీ అప్డేట్‌ను పట్టుకొచ్చింది ఈ బ్యూటీ.
రష్మిక నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని రష్మక పాత్రకు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్పెషల్ ప్రశంసలు కురిపించాడు. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The post ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.