‘డాకు మహారాజ్’కి రవితేజ వాయిస్ ఓవర్ ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 8, 2024 9:59 AM IST

దర్శకుడు బాబీ – నందమూరి నటసింహం బాలయ్య కాంబినేషన్‌ లో “డాకు మహారాజ్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌ కి సిద్ధంగా ఉంది. బాలయ్య పాత్రను, రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నాడని టాక్. పైగా రవితేజ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. అన్నట్టు ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *