Published on Dec 1, 2024 7:03 PM IST
ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ అండ్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఈ సినిమాతో అనుకున్న రేంజ్ విజయాన్ని అయితే అందుకోలేదు. ఇక దీనితో నెక్స్ట్ అంచనాలు అన్నీ “మాస్ జాతర” పైనే ఉన్నాయి. అయితే ఇపుడు తన లైనప్ పైనే ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది.
దీనితో తాను ఓ తమిళ స్టార్ హీరో సినిమాలో క్యామియో చేయనున్నట్టుగా వినిపిస్తుంది. మరి ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ నటుడు సూర్య సినిమాలో అట. ప్రస్తుతం సూర్య చేస్తున్న చిత్రాల్లో యువ దర్శకుడు ఆర్ జె బాలాజీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలోనే మాస్ మహారాజ ఓ సాలిడ్ క్యామియో చేయనున్నట్టు వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపైనే చర్చలు నడుస్తున్నాయట. మరి వీటిలో ఎంతమేర నిజం ఉంది అనేది చూడాలి.