Published on Dec 1, 2024 2:01 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో తన బిగ్గెస్ట్ హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రమే ఇది. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. మరి 1100 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ జపాన్ దేశంలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
మరి అక్కడ ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 3న రిలీజ్ కాబోతుండగా ఇపుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ సహా చిత్ర యూనిట్ జపాన్ కి పయనం కానున్నట్టుగా తెలుస్తుంది. మరి జపాన్ లో ప్రభాస్ కి కూడా మంచి ఫాలోయింగ్, ప్రేమ ఉంది మరి కల్కి కూడా డెఫినెట్ గా అక్కడ మంచి సక్సెస్ ని సాధిస్తుంది అని ముందే చెప్పొచ్చు. మరి అక్కడ ఈ భారీ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాల్సిందే.