తెలుగు సినిమా ఇప్పుడు దేశీయంగా కాదు.. గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది. కానీ ఈ వెలుగు వెనుక మిగిలిన చీకట్లు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం, స్టార్ హీరోల పారితోషికాలు, ఎగ్జిబిటర్ల లాభాల అంశం ఇవన్నీ ఇప్పుడు టాలీవుడ్‌లో వేడి చర్చకు దారితీశాయి.

ప్రతి సంవత్సరం టాలీవుడ్‌లో దాదాపు 300 సినిమాలు రిలీజ్ అవుతున్నా, వాటిలో కేవలం 10% సినిమాలే భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి. మిగిలిన 90% చిన్న సినిమాలే. ఇండస్ట్రీ టర్నోవర్ వాటి మీదే ఆధారపడి ఉంటుంది.

అయితే పెద్ద సినిమాల విషయంలో, తారల పారితోషికాలు, టెక్నికల్ బడ్జెట్, ప్రమోషన్స్ ఇలా అన్నింటికీ భారీ ఖర్చు ఉంటుంది. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో ఉన్నారు అనే వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిర్మాతలు మాత్రం ఎదో ఒకపక్క నుండి ఎగ్జిబిటర్లకు వచ్చే సప్లిమెంటరీ రెవెన్యూలపై ఫోకస్ పెట్టాల్సిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలు తమ పారితోషికం తగ్గించి, సినిమా లాభాల్లో వాటా తీసుకుంటే కొంతైనా ఫెయిర్ సిస్టం అవుతుందని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఒక సినిమా బిజినెస్ మోడల్‌ను పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. నిర్మాణ వ్యయం, రెవెన్యూ షేరింగ్, థియేటర్ లాభాలపై క్లారిటీ ఉండాలి. లేకపోతే చిన్న సినిమాలకు, నిర్మాతలకు తలదాచుకునే చోటు ఉండదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *