Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌ కన్నుమూత

  • ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) కన్నుమూత
  • అనారోగ్య కారణాలతో అమెరికాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

Zakir Hussain: ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని జాకీర్ హుస్సేన్ స్నేహితుడు తెలిపారు. కాగా జాకీర్‌కు రక్తపోటు సమస్య ఉన్నట్లు సమాచారం.

Read Also: Big Boss 8 Telugu Winner: బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్

జాకీర్‌ హుస్సేన్‌ మృతితో భారతీయ చలన చిత్రరంగం, ప్రపంచ సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైలో 1951 మార్చి 9న జన్మించిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీత ప్రయాణం తన చిన్నతనంలోనే ప్రారంభమైంది. కేవలం 11 ఏళ్ల వయస్సులో, ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *