Richard Rishi’s Sister is a Star
Richard Rishi’s Sister is a Star

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోలుగా, విలన్‌లుగా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రిచర్డ్ రిషీ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అతని పేరు వినగానే గుర్తు రాకపోవచ్చు, కానీ ఫోటో చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు.

రిచర్డ్ రిషీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడు. కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మారి, ‘A Film By అరవింద్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’ వంటి సినిమాల్లో కూడా మెప్పించాడు.

అయితే రిచర్డ్ రిషీ ఇంట్లోనే మరో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. అతనికి ఇద్దరు చెల్లెళ్లు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌లుగా రాణించారు. వారు షాలిని, షామిలి. షాలిని ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా 8 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా ఎక్కువగా కనిపించలేదు. కానీ ఆమె ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ భార్య.

షాలిని చెల్లెలు షామిలి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘ఓయ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *