Published on Dec 3, 2024 4:00 PM IST
కన్నడ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార’ చిత్రంతో ఒక్కసారిగా ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ‘కాంతార-2’తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రిషబ్ శెట్టి రెడీ అవుతున్నాడు.
దీంతో పాటు ఆయన తెలుగులో ‘జై హనుమాన్’ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇలా పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయబోతున్న రిషబ్ శెట్టి, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు రిషబ్ శెట్టి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను సందీప్ సింగ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేశాడు రిషబ్ శెట్టి.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో రిషబ్ శెట్టి శివాజీ మహారాజ్ పాత్రలో ఎలాంటి యాక్షన్‌ను తీసుకొస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.