“జై హనుమాన్” కాకుండా మరో సినిమాలో రిషబ్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

కన్నడ సినిమా దగ్గర సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “కాంతార” కూడా ఒకటి. అయితే ఇపుడు దీనికి ప్రీక్వెల్ లో తాను బిజీగా ఉండగా ఈ సినిమా సహా రిషబ్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సూపర్ హీరో సీక్వెల్ చిత్రం “జై హనుమాన్” లో రిషబ్ ఉంటాడు అని గట్టి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగులో ఈ సినిమా కాకుండా మరో సినిమా కూడా తాను ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.

ఇది కూడా ఓ ప్రముఖ బ్యానర్ లో అన్నట్టుగా టాక్. ఇలా తెలుగులో అయితే మొత్తం రెండు సినిమాలు వరుసగా రిషబ్ చేతిలో పెట్టుకున్నాడని చెప్పాలి. మరి జై హనుమాన్ కాకుండా మరో సినిమా ఏంటి అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

The post “జై హనుమాన్” కాకుండా మరో సినిమాలో రిషబ్!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *