తన భర్త, హీరో ధర్మ మహేష్, కు ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న నటి రీతు చౌదరితో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమీ చౌదరి, ఇప్పుడు మరో బాంబు పేల్చింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వద్ద ఇంటి లోపలికి వెళుతూ, బయటికి వస్తున్న వీడియోలే కాదు, వాళ్లిద్దరూ ఇంటిమేట్‌గా ఉంటూ సె* చేసుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ, తన సంస్కారవంతురాలని కాబట్టి ఆ వీడియోలు బయట పెట్టడం లేదని ఆమె పేర్కొంది. తాను, తన భర్త ఇద్దరం కలిసి సదరు ఇంట్లో అద్దెకు దిగామని, కాబట్టి ఆ ఇంట్లో తనకు కూడా అధికారం ఉంటుందని చెప్పుకొచ్చింది.
Also Read :Kakinada : కాకినాడ ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన – సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన
అధికారంతోనే తనకు ఎక్కడ కావాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశానని, అలా ఫిక్స్ చేయించినప్పుడే వీరి బాగోతం బయటపడిందని చెప్పుకొచ్చింది. అంతేకాక, రీతు చౌదరి బిగ్ బాస్‌కి ఎంపికైనట్లు తెలిసిన తర్వాత కూడా తమ ఫ్లాట్‌కి వచ్చి అతనితో సమయం గడిపిందని ఆమె పేర్కొంది. ఒక ఆడ, మగ మధ్య స్నేహం కూడా ఉండవచ్చు, కానీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత లోపలికి వెళ్లడం, తెల్లవారుజాములోపు బయటకు రావడం వంటివి మామూలు స్నేహితులు చేసే పనేనా అంటూ ఆమె ప్రశ్నించింది. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కాబట్టే లోకం కళ్ళు కప్పి దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొంది. తన భర్తకు రీతు చౌదరితో కాకుండా, మరికొంతమంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌లతో కూడా సంబంధం ఉందని గౌతమీ చౌదరి ఆరోపించింది.