నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అతన్ని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు జనార్థన్ రావుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో రఘు బాబు కారు నడుపుతున్నారు. నార్కట్ పల్లి , అద్దంకి రోడ్డులో పానగల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

రఘు బాబు కారు రోడ్డు క్రాస్ చేస్తున్న జనార్థనరావు బైక్ ను వెనకనుంచి ఢీకొట్టింది. బైక్ మీదున్న వ్యక్తి అక్కడే చనిపోయారు. పోలీసులు విచారణ చేపట్టి రఘు బాబుపై కేసు నమోదు చేశారు. ఘటన స్థలంలో రఘుబాబుతో స్థానికులు వాగ్వాదం చేశారు. బెయిల్ తీసుకున్న రఘుబాబు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.