ఎమోషనల్ గా రాకింగ్ రాకేష్ “కేసీఆర్” ట్రైలర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


తెలుగు స్మాల్ స్క్రీన్ హిట్ షో “జబర్దస్త్” నుంచి వచ్చిన ఎంతోమంది ప్రముఖ కమెడియన్స్ లో యువ నటుడు రాకింగ్ రాకేష్ కూడా ఒకడు. మరి తన టాలెంట్ తో బుల్లితెరపై సత్తా చాటిన ఈ యంగ్ కమెడియన్ సిల్వర్ స్క్రీన్ పై కూడా పలు సినిమాలు చేసాడు. కానీ ఇప్పుడు తానే లీడ్ రోల్ లో చేసిన లేటెస్ట్ చిత్రమే “కేశవ చంద్ర రామావత్”.

షార్ట్ కట్ గా “కేసీఆర్” గా మేకర్స్ నామకరణం చేసిన ఈ సినిమా నుంచి నేడు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. దీనితో రాకింగ్ రాకేష్ కి ఈ సినిమా ఓ డీసెంట్ ఎమోషనల్ డెబ్యూ గా మారేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, రచన సహా నిర్మాణం రాకింగ్ రాకేష్ అందించగా గరుడ వేగ అంజి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే విభూది ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post ఎమోషనల్ గా రాకింగ్ రాకేష్ “కేసీఆర్” ట్రైలర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *