Mon. Oct 13th, 2025
Roshan Kanakala : రోషన్‌ కనకాల ‘మోగ్లీ 2025’ రిలీజ్ డేట్ ఫిక్స్!

రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మోగ్లీ 2025’కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాకు సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. అడవిలో సాగే సస్పెన్స్‌, యాక్షన్‌, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ కథలో రోషన్‌ ఓ ఎమోషనల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాను డిసెంబర్‌ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Additionally Learn : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్‌.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా?

ఈ సినిమాలో హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీ, బండి సరోజ్‌ విలనిజమ్‌, అలాగే అడవి నేపథ్యం సినిమాలోని విజువల్స్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. యూత్‌కు నచ్చే లవ్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే ఎమోషనల్‌ డ్రామా ఈ సినిమాలో ఉందని మేకర్స్‌ నమ్ముతున్నారు. రోషన్‌ కెరీర్‌లో ‘మోగ్లీ 2025’ మరో మైలురాయిగా నిలుస్తుందని ఫిలిం యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.