Published on Dec 18, 2024 7:55 PM IST
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రాజీవ్ కనకాల, టాప్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల ఇప్పటికే హీరోగా తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బబుల్ గమ్’ అనే సినిమాతో రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా, ఇప్పుడు తన కొత్త సినిమాతో రోషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
‘కలర్ ఫోటో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్షన్‌లో రోషన్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘మోగ్లీ 2025’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కూడా రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. డిసెంబర్ 19న మోగ్లీ 2025 చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో హర్ష చెముడు కూడా ఓ కీలక పాత్రలో నటిస్టున్నాడు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.